Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోలీవుడ్ అవకాశాలపై కన్నేసిన మెహ్రీన్

  • 'ఎఫ్ 2'తో దక్కిన భారీ విజయం 
  • వరుసగా ఎదురవుతున్న పరాజయాలు 
  •  తమిళం నుంచి వచ్చిన 'పట్టాస్' సక్సెస్  
తెలుగు తెరకి పరిచయమైన అందాల కథానాయికలలో మెహ్రీన్ ముందు వరుసలో కనిపిస్తోంది. యూత్ లో ఈ సుందరికి మంచి క్రేజ్ వుంది. ఆ మధ్య మెహ్రీన్ చేసిన 'ఎఫ్ 2' ఆమెకి భారీ విజయాన్ని అందించడంతో, ఇక ఆమె దశ తిరిగిపోయినట్టేనని అంతా అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు వరుస పరాజయాలు ఆమెను పలకరిస్తూ వస్తున్నాయి. 'చాణక్య' .. ' ఎంతమంచివాడవురా' .. 'అశ్వద్ధామ' సినిమాలు ఆమెను పూర్తిగా నిరాశపరిచాయి. ప్రస్తుతం ఆమె చేతిలో చెప్పుకోదగిన ప్రాజెక్టు ఏదీ లేదు.

ఈ నేపథ్యంలో ఆమె కోలీవుడ్ పై తన దృష్టిపెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇటీవల తమిళంలో ధనుశ్ జోడీగా ఆమె చేసిన 'పట్టాస్' ఆమె ఖాతాలో పెద్ద హిట్ నే జమ చేసింది. దాంతో ఆమెను సంప్రదించే అక్కడి నిర్మాతల సంఖ్య పెరిగిందట. ఇదే అదనుగా అక్కడ వరుస అవకాశాలను అందిపుచ్చుకునే పనిలో మెహ్రీన్ ఉందని అంటున్నారు. ఒకప్పుడు నగ్మా .. ఖుష్బూ .. మీనా .. హన్సిక మాదిరిగానే కోలీవుడ్లో మెహ్రీన్ తన జోరు చూపించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Mehreen
Ashwathama Movie
pattas Movie

More Telugu News